పట్టాలు తప్పిన వాస్కోడిగామా-పట్నా ఎక్స్‌ప్రెస్

పట్టాలు తప్పిన వాస్కోడిగామా-పట్నా ఎక్స్‌ప్రెస్

బందా: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బందా దగ్గర వాస్కోడిగామా- పట్నా ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది.ఈ ప్రమాదం లో  మొత్తం 13 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ రోజు తెల్లవారుజామున బందా ప్రాంతానికి దేగ్గర్లో కి చేరుకోగానే 13 భోగీలు ఒక్క పక్కకి ఒరిగాయి.విషయం తెలుసుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే సిబ్బంది, స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు.

ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులు మృతి చెందగా మరో 32 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఇందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.