ప్రేమించలేదని పరువు తీశాడు ..

ప్రేమించలేదని పరువు తీశాడు ..

  హైదరాబాద్ : ప్రేమించలేదని ఓ యువతి ప్రతిష్టను దెబ్బ తీసేందుకు ప్రయత్నించిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిని సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. సైబర్ క్రైం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..కూకట్‌పల్లి ప్రాంతానికి చెందిన ఓ యువతి తన పేరుతో భర్త, తండ్రి, బంధువులు, స్నేహితులకు అభ్యంతకరమై న, అసభ్యకరమైన మెయిల్స్, మెసేజ్‌లు, ఫొటోలు పోస్టింగ్‌లు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఇది సందీప్ కుమార్ గుప్తా పెరుమాళ్ల పనిగా అనుమానం వ్యక్తం చేస్తూ సోమవారం సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు.


దీనిపై యవతికి, బంధువులకు వచ్చిన మెయిల్స్ ఐపీ అడ్రస్సు ఆధారంగా చన్నై లోని సెమెన్ చెర్రి ప్రాంతంలోని ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పని చేస్తున్న సందీప్‌కుమార్ గుప్తా పెరుమాళ్ళగా గుర్తించి అతనిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో యువతి తన ప్రేమను నిరాకరించి మ రొకరిని వివాహం చేసుకున్నందుకు కోపం పెంచుకుని ఆమెపై పగ సాధించాలని ఈ విధంగా వ్యవహరించానని వాంగ్మూలం ఇచ్చాడు. దీంతో మంగళవారం అతన్ని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.