ప్రియుడు మందంలించాడని యువతి ఆత్మహత్య

ప్రియుడు మందంలించాడని యువతి ఆత్మహత్య

  జవహర్‌నగర్‌: ప్రియుడు మందలించడంతో మనస్తాపానికి గురై ప్రియురాలు ఆత్మహత్య చేసుకుంది. జవహర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని శాంతినగర్‌లో ఈ ఘటన జరిగింది. ఎస్‌ఐ సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. జవహర్‌నగర్‌ ఫైరింగ్‌కట్ట ప్రాంతంలోని శాంతినగర్‌లో వాణి (23) తన కుటుంబసభ్యులతో కలిసి ఉంటోంది. సికింద్రాబాద్‌కు చెందిన భరత్, వాణి కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. కుటుంబసభ్యులు వీరిద్దరికీ పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 5న వాణి ఇంటికి వచ్చిన భరత్‌ ఆమెను బైక్‌పై తీసుకెళ్లాడు.

వాణి ప్రవర్తనలో మార్పువచ్చిందని మందలించి  ఇంటివద్ద వదిలి వెళ్లిపోయాడు. దీంతో మనస్తాపానికి గురైన వాణి సోమవారం రాత్రి తన బెడ్‌రూంలోకి వెళ్లి ఫ్యాన్‌ రాడ్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తండ్రి సదానంద్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు భరత్‌పై కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.