రిపోర్టులను పరిశీలించిన తర్వాతె చర్యలు....

రిపోర్టులను పరిశీలించిన తర్వాతె చర్యలు....

సెప్టెంబర్‌ తర్వాత డ్రగ్స్‌ కేసులో నిందితులపై చర్యలు ఉంటాయని, సినీ రంగానికి సంబంధించి విచారణ పూర్తయిందని ఎక్సైజ్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్‌ అకున్‌ సబర్వాల్ తెలిపారు. చెప్పారు. డ్రగ్స్ వ్యవహారంలో 11 కేసులకు సబంధించి చార్జిషీట్‌ దాఖలు చేస్తామన్నారు. డ్రగ్స్‌ కేసు విచారణలో ఎవరి ఒత్తిళ్లు లేవన్న అకున్‌ సబర్వాల్ దర్యాప్తు పారదర్శకంగా కొనసాగుతోందని తెలిపారు.

ఈ కేసులో విచారణ ఆగిపోలేదని, పారదర్శకంగా ముందుకు సాగుతోందని, ఈ విషయంలో తమపై ఎటువంటి ఒత్తిళ్లూ లేవన్నారు. సెప్టెంబర్ తర్వాత ఈ కేసులో చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు. రక్త నమూనాలు తీసుకున్న నటీనటుల రిపోర్టులను పరిశీలించిన తర్వాత వారిపై చర్యలుంటాయని తెలిపారు.