రోడ్డు ప్రమాదంలో హెచ్‌సీయూ విద్యార్థిని దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో హెచ్‌సీయూ విద్యార్థిని దుర్మరణం

 రంగారెడ్డి:హైదరాబాద్  నగరంలోని ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవారం ఉదయం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన ముగ్గురు విద్యార్థులు కారులో ప్రయాణిస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో యూపీకి చెందిన విద్యార్థిని అనన్య మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. అత్యవసర చికిత్సకై క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. కాగా ఇద్దరి పరిస్థితీ విషమంగానే ఉందని వైద్యులు చెబుతున్నారు. స్థానిక సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పెద్దఅంబర్‌పేట నుంచి షాద్‌‌నగర్ వెళ్తుండగా ఈ ఘోరం జరిగింది. కాగా ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.