స్కూటీని ఢీకొన్న డీసీఎం వ్యాన్

స్కూటీని ఢీకొన్న డీసీఎం వ్యాన్

హైదరాబాద్:నగరం లో ఘోర రోడ్ ప్రమాదం. వేగంగా వెళ్తున్న డీసీఎం వ్యాను అదుపుతప్పి స్కూటీని ఢీకొట్టింది.ఈ ఘటన నగరంలోని పేటబషీరాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలోని కొంపల్లి వద్ద రోడ్డుప్రమాదం జరిగింది.

ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.గాయపడ్డ వారిని వైద్యం కొరకు హాస్పిటల్ కి తరలించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.