సెక్రటేరియట్‌ వద్ద కారు బీభత్సం

సెక్రటేరియట్‌ వద్ద కారు బీభత్సం

  హైదరాబాద్ : సెక్రటేరియట్‌ సమీపంలో గురువారం ఓ కారు బీభత్సం సృష్టించింది. కోఠికి చెందిన ముగ్గురు యువకులు తప్పతాగి.. వాహనం నడపడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. వేగంగా వచ్చిన మారుతీ రిట్జ్‌ కార్‌ సెక్రటేరియట్‌ సమీపంలోని చెట్టును ఢీకొట్టి.. పల్టీలు కొట్టింది. యాక్సిడెంట్‌ గురించి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని కేసు నమోదు చేశారు. మద్యం తాగి వాహనం నడపడం వల్లే ఈ ప్రమాదం సంభంవించినట్లు పోలీసులు నిర్థారించారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.