శశికళ ఆస్తులపై కొనసాగుతున్న ఐటీ దాడులు

శశికళ ఆస్తులపై కొనసాగుతున్న ఐటీ దాడులు

చెన్నై: తమిళనాడులో పన్ను ఎగవేత ఆరోపణలు ఎదుర్కుంటున్న శశికళ పై గురువారం(నవంబర్-9) నుంచి ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఐటీ సోదాల్లో ఇప్పటి వరకు శశికళ అక్రమాస్తులు భారీగా బయటపడ్డాయి.

జయ టీవీ కార్యాలయం, శశికళ ఆస్తులపై మూడో రోజు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. శశికళ కుటుంబం, బంధువుల పేరుతో 10 బోగస్‌ కంపెనీలు ఉన్నట్లు గుర్తించిన అధికారులు నోట్ల రద్దు సమయంలో బోగస్‌ కంపెనీల ద్వారా భారీగా లావాదేవీలు జరిగినట్లు తనిఖీల్లో తేలింది.

శశికళకు చెందిన 315 బ్యాంక్‌ ఖాతాలను ఐటీ అధికారులు సీజ్‌ చేసి, దాదాపు 700 కీలక పేపర్లను స్వాధీనం చేసుకున్నారు. దాదాపు రూ.1000 కోట్లకు పైగా ఆదాయపు పన్ను ఎగవేసినట్లు అధికారులు గుర్తించారు. చెన్నైలోని మొత్తం 40 ప్రాంతాల్లో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.