షాపింగ్‌మాల్‌లో దోపిడీకి ప్లాన్ చేస్తుండగా..

షాపింగ్‌మాల్‌లో దోపిడీకి ప్లాన్ చేస్తుండగా..

  ముంబై: దోపిడీకి పాల్పడేందుకు ప్రయత్నించిన నలుగురు వ్యక్తులను మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. నలుగురు వ్యక్తులు సెంట్రల్ ముంబైలోని నాగ్‌పడా ప్రాంతంలో దోపిడీకి ప్లాన్ చేస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన వారిలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఛోటా షకీల్ ముఠాకు చెందిన సభ్యుడు ఉన్నట్లు పోలీస్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. నిందితుల నుంచి దేశీయ పిస్తోల్, కారంపొడి, ఒక బొమ్మ తుపాకిని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. నిందితులు సిటీ సెంట్రల్ మాల్‌కు సమీపంలో వ్యాపారికి చెందిన దుకాణసముదాయంలో దోపిడీకి స్కెచ్ వేసినట్లు వెల్లడించారు. నలుగురు నిందితులపై థానేలోని వివిధ పోలీస్‌స్టేషన్లలో హత్య, హత్యాయత్నం, చోరీ, దోపిడీ, బలవంతపు వసూళ్లకు పాల్పడిన ఘటనల్లో కేసులు నమోదై ఉన్నట్లు పేర్కొన్నారు.