సినిమాల్లో అవకాశం కోసం వ్యభిచారం

సినిమాల్లో అవకాశం కోసం వ్యభిచారం

  బంజారాహిల్స్‌ : వెండితెర మీద వెలిగిపోవాలన్న కోరిక.. ఎలాగైనా సినిమాల్లో రాణించాలనే తపన.. వీటికి ఆర్థిక ఇబ్బందులు అడ్డొచ్చాయి. వాటి నుంచి బయటపడి కలల లోకాన్ని చేరుకునేందుకు ఆమె తప్పుడు మార్గాన్ని ఎంచుకొని పోలీసులకు చిక్కింది. ఇంజినీరింగ్‌ ఆఖరి సంవత్సరం చదువుతున్న యువతి వ్యభిచార గృహంలో పోలీసులకు దొరికిపోయింది. బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.


యూసుఫ్‌గూడ సమీపంలోని ఎల్‌ఎన్‌ నగర్‌లో నాగభాస్కర్‌ అలియాస్‌ విక్కి కొంత కాలంగా వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్నాడు. పి.సాయి దుర్గాప్రసాద్‌ అలియాస్‌ కార్తీక్, పి.ధర్మ అనే ఇద్దరు ఆయనకు అసిస్టెంట్లుగా పని చేస్తున్నారు. అందంగా ఉన్న అమ్మాయిలను ఎంచుకొని వారి బలహీనతలను ఆసరాగా చేసుకొని అడిగినంత డబ్బు ఇచ్చి వ్యభిచార కూపంలోకి లాగుతున్నారు. ఈ నేపథ్యంలో బీటెక్‌ ఆఖరి సంవత్సరం చదువుతున్న ఓ అందమైన అమ్మాయి తనకు సినిమాల్లో నటించాలని కోరిక ఉందని దుస్తులు, మేకప్, ఖర్చుల కోసం డబ్బులు లేవని చెప్పడంతో వీరు ఆమెను ట్రాప్‌ చేశారు.

సినిమా షూటింగ్‌ కోసమంటూ అందమైన ఫొటోలు తీశారు. విషయం ముందుగానే చెప్పి ఆ ఫొటోలను కొందరు యువకులకు పోస్ట్‌ చేసి బేరం పెట్టారు. ఇంకేముంది చాలా మంది ఆమె కావాలన్నారు.  రెండు రోజుల క్రితం ఎల్‌ఎన్‌నగర్‌లోని వ్యభిచార గృహంపై దాడి చేసిన సమయంలో ఆమె పోలీసులకు చిక్కింది. ఆమె వివరాలు రాబట్టగా ఇంజినీరింగ్‌ చదువుతున్నట్లు తేలింది.

ఆమెతో పాటు ముంబైకి చెందిన మరో మోడల్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరిని నింబోలి అడ్డాలోని బాలికల పునరావాస కేంద్రానికి తరలించారు. వ్యభిచార గృహ నిర్వాహకుడు విక్కీ పరారీలో ఉండగా అసిస్టెంట్లు కార్తీక్, ధర్మాలను ఐపీసీ సెక్షన్‌ 370, 370ఏ, పీటా యాక్ట్‌ కింద అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.