సిరిసిల్లలో ఘోర రోడ్డు ప్రమాదం

సిరిసిల్లలో ఘోర రోడ్డు ప్రమాదం

  సిరిసిల్ల: జిల్లా కేంద్రంలోని బైపాస్‌ రోడ్డుపై మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపుతప్పి కారు, ట్రక్కు వేగంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులోని ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను దగ్గరలోని ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంతో సంఘటనాస్థలం వద్ద విషాద వాతావరణం నెలకొంది. స్థానికుల సమాచారంతో సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులు కరీంనగర్‌ జిల్లా రాంపూర్‌కు చెందిన కందుకూరి అనిల్‌, ఆయన కుమారులు సృజన్‌, సూరజ్‌లుగా గుర్తించారు. ఆయన భార్య గీత పరిస్థితి విషమంగా ఉంది.