సోషల్‌మీడియాలో పుకార్లు..వాట్సాప్ అడ్మిన్ అరెస్ట్

సోషల్‌మీడియాలో పుకార్లు..వాట్సాప్ అడ్మిన్ అరెస్ట్

  శ్రీనగర్ : ఓ వ్యక్తి ఉగ్రవాద సంస్థలో చేరాడంటూ సోషల్‌మీడియాలో పుకార్లు సృష్టించిన మరో వ్యక్తిని జమ్మూకశ్మీర్ పోలీసులు అరెస్ట్ చేశారు. గండేర్బాల్ జిల్లా బీహమాకు చెందిన షాపు యజమాని అకీబ్ ఫరూఖ్ మిర్ ఫొటోను వాట్సాప్ లో పెట్టారు. అయితే అకీబ్ ఫరూఖ్ ఫొటోను ఉంచి, ఉమర్ షెయిర్ గోజ్రి అలియాస్ అబూ జీసన్ అనే నకిలీ పేరుతో అతను ఉగ్రవాద సంస్థలో చేరాడని మెసేజ్ పెట్టారు. ఆ మెసేజ్ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో జమ్మూకశ్మీర్ పోలీసులు దర్యాప్తు జరిపి పుకార్లను సృష్టించిన వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ మంజూర్ అహ్మద్ ఘనీని అరెస్ట్ చేశారు. అహ్మద్ ఘనీ రెండు వాట్సాప్ గ్రూప్‌లకు అడ్మిన్‌గా ఉన్నాడని..అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నామని పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.