సొరంగం తవ్వి బ్యాంకు లాకర్లు లూటీ

సొరంగం తవ్వి బ్యాంకు లాకర్లు లూటీ

ముంబై: నవీ ముంబైలో భారీ చోరీ జరిగింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన నవీ ముంబైలోని బ్యాంక్ ఆఫ్ బరోడాలోజరిగింది. బ్యాంక్ ఆఫ్ బరోడాలోని లాకర్ రూంలోకి దొంగలు ప్రవేశించి...27 లాకర్లను లూటీ చేశారు. ఈ నెల 13వ తేదీ సోమవారం ఉదయం ఓ కస్టమర్ లాకర్ రూంలోకి ఎంటర్ అయినప్పుడు దోపిడీ జరిగినట్లు గుర్తించారు అధికారులు.

శని, ఆదివారలు సెలవుల తర్వాత బ్యాంక్ ఓపెన్ అయ్యింది.యధావిధిగా లావాదేవీలు జరుగుతున్నాయి. ఓ కస్టమర్ లాకర్ ఓపెన్ చేయటానికి వచ్చాడు. అతనితోపాటు మేనేజర్ కూడా స్ట్రాంగ్ రూంలోకి వెళ్ళిన తర్వాత...27 లాకర్లు ఓపెన్ చేసి ఉండటం చూసి షాక్ అయ్యారు.

ఆ గది మూలన రంధ్రం ఉండటం తో వెంటనే పోలీసులుకు సమాచారం ఇచ్చారు. 27 లాకర్లలో ఏం ఉన్నాయ్...ఈ లాకర్ కస్టమర్ల సమాచారం ఆధారంగా విలువ లెక్కగలం అంటున్నారు అధికారులు. 27 లాకర్లలో బంగారు ఆభరణాలు ఉన్నాయని కస్టమర్లు చెబుతున్నారు. కోట్లలోనే విలువ ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

స్ట్రాంగ్ రూంలోకి ఎంటర్ అయిన సొరంగం నుంచి వెళితే...పక్కన షాపులోకి వెళ్లింది. రెండు రోజుల బ్యాంక్ సెలవులు ఉండటంతో షాపు నుంచి సొరంగం తవ్వి ఈ దోపిడీ చేసినట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు పోలీసులు.