వీ6 న్యూస్‌ రీడర్‌ ఆత్మహత్య

వీ6 న్యూస్‌ రీడర్‌ ఆత్మహత్య

 హైదరాబాద్‌ : వీ6 చానల్‌ న్యూస్‌ రీడర్‌ వెంకన్నగారి రాధిక (36) ఆదివారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. మూసాపేట్‌లోని గూడ్స్‌షెడ్‌ రోడ్డు శ్రీవీలా అపార్టుమెంట్‌ రెండో ఫ్లోర్‌ 204 ఫ్లాట్‌లో నివసిస్తుంది. ఆమె ఆదివారం రాత్రి 10.40 సమయంలో విధులు ముగించుకుని ఇంటికొస్తూనే అపార్టుమెంట్‌ 5వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె బ్యాగులో సూసైడ్‌ లెటర్‌ లభ్యమైంది.

‘కేవలం నా డిప్రెషన్‌ వల్ల మాత్రమే చనిపోతున్నాను. నా మెదడు నా శత్రువు’ అని నోట్‌లో రాసి ఉంది. ఆరు నెలల కిందట భర్త నుంచి రాధిక విడాకులు తీసుకుంది. బుద్ధిమాంద్యంతో బాధపడుతున్న తన 14 ఏళ్ల కుమారుడు, తల్లిదండ్రులతో కలసి ఆమె అపార్ట్‌మెంట్‌లో నివాసముండేది. రాధిక ఆత్మహత్య సమాచారం అందిన వెంటనే కూకట్‌పల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.