వాట్సాప్‌ ద్వారా డ్రగ్స్ అమ్మకాలు...అరెస్ట్

వాట్సాప్‌ ద్వారా డ్రగ్స్ అమ్మకాలు...అరెస్ట్

 సికింద్రాబాద్  నగరంలో ఇద్దరు డ్రగ్స్ డీలర్లను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. జంట నగరాల్లో డ్రగ్స్ విక్రయంపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దృష్టిసారించగా పలు ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. డ్రగ్స్ విక్రయాలకు ఏకంగా డీలర్లే ఉండటం విశేషం. కామెరున్‌ దేశానికి చెందిన మెక్‌డొనాల్డ్‌, నైజీరియాకి చెందిన పాల్‌ను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. 

ఈ సందర్బంగా వీరినుంచి 60 గ్రాములు కొకైన్‌, 90 గ్రాముల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. గత కొంతకాలంగా హైదరాబాద్ లో వాట్సాప్ ద్వారా అమ్మకాలు చేస్తున్నారు. పబ్‌లు, హోటళ్లలో సిబ్బంది ద్వారా కస్టమర్లకు డ్రగ్స్‌ సరఫరా చేస్తున్నారు. ఒక్కో గ్రాము రూ. 5వేల నుంచి 6వేల వరకు అమ్ముతున్నారు. ఎట్టకేలకు పోలీసులు ఈ డ్రగ్స్ దందాను గుర్తించి వీరి కార్యకలాపాలను తాత్కాలికంగా నిరోధించగలిగారు.