యుపిలో బాలిక కిడ్నాప్‌, అత్యాచారం

యుపిలో బాలిక కిడ్నాప్‌, అత్యాచారం

  ముజఫర్‌నగర్‌ : ఉత్తరప్రదేశ్‌లోని షామ్లి జిల్లాలోని ఒక గ్రామంలో 17ఏళ్ళ బాలికను కిడ్నాప్‌ చేసిన ఇద్దరు యువకులు ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టారని పోలీసులు గురువారం తెలిపారు. ఆ బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం, బుధవారం ఆమె తన బంధువు ఇంటి నుండి వస్తుండగా స్కూలు సమీపంలో ఈ యువకులు కిడ్నాప్‌ చేసి దారుణానికి పాల్పడ్డారని చెప్పారు. బాలిక ఎంతసేపటికీ ఇంటికి రాకపోయేసరికి కుటుంబ సభ్యులు గాలింపు జరపగా స్పృహ లేని స్థితిలో, వంటిపై గాయాలతో కనిపించింది. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం పరారీలో వున్న యువకులపై కేసు నమోదు చేసారు.