లష్కర్‌ బోనాలపై పోలిసుల నిఘా.

లష్కర్‌ బోనాలపై పోలిసుల నిఘా.

లష్కర్‌ బోనాలపై పోలిసుల నిఘా.

హైదరాబాద్‌ సిటీ: మహంకాళి బోనాల జాతర అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. సికింద్రాబాద్‌ మహంకాళి ఆలయానికి వీఐపీలు, మంత్రులు, సెలెబ్రిటీల తాకిడి ఎక్కువగా ఉండడంతో పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. నగరంలో ఐఎస్‌ ఉగ్రవాదులు ఇటీవల పట్టుబడిన నేపథ్యంలో నిఘా పెంచారు. బాంబు స్క్వాడ్‌ తనిఖీలు చేస్తోంది. భక్తులకు అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా హైటెక్నాలజీతో అడుగడుగునా జల్లెడపడుతున్నారు.మూడువేల మంది పోలీసులతో బందోబస్తు
నాలుగు కిలోమీటర్ల పరిధిలో 140 సీసీ కెమెరాలు ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌,
బాడీవేర్‌ కెమెరాలతో.. ప్రత్యేక ప్రాంతాల్లో పోలీసులు బాడీవేర్‌ కెమెరాలతో నిఘా వేయనున్నారు. ఇందుకోసం 20 కెమెరాలను సిద్ధం చేశారు. ఏదైనా గొడవ జరిగినప్పుడు అక్కడి పరిస్థితిని, అందులో జోక్యం చేసుకున్న వ్యక్తుల కదలికలను రికార్డు చేయనున్నారు. అలజడి సృష్టించి వెళ్లిపోదామనే వారి ఆటలు సాగనీయకుండా చర్యలు తీసుకుంటున్నారు.
ఆలయం చుట్టూ నాలుగు కిలోమీటర్ల పరిధి వరకూ 140 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. మూడువేల మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించనున్నారు. 230 మంది మహిళా పోలీసులు ఆలయంలో విధులు నిర్వహించనున్నారు. రాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌, క్రైం పోలీసులతో అల్లరి మూకలపై ప్రత్యేక నిఘా వేయనున్నారు. ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో ప్రజలకు తెలిసేలా వాచ్‌టవర్‌ కూడా ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.
చైన్‌స్నాచర్స్‌, ఆకతాయిలకు చెక్‌ చైన్‌ స్నాచర్స్‌ చేతివాటం చూపే ప్రయత్నం చేస్తే పోలీసులు క్షణాల్లో పట్టుకునేలా ఏర్పాట్లు చేశారు. యాంటీ చైన్‌ స్నాచింగ్‌ పోలీసులు వారిపై ప్రత్యేక నిఘా ఉంచనున్నారు. పోలీస్‌స్టేషన్లల నమోదైన నిందితుల గురించి ఆరా తీస్తున్నారు. అమ్మవారి దర్శనానికి వచ్చే మహిళలు ఆభరణాలు జాగ్రత్తగా ఉండాలని పోస్టర్లు, బ్యానర్లు ఆలయ పరిసరాల్లో ఏర్పాటు చేశారు.
మహంకాళి పోలీస్‌ స్టేషన్‌ నుంచి సీసీకేమెరాల ఫుటేజీని పర్యవేక్షించడానికి ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని ఉన్నతాధికారులకు చేరవేస్తారు. యువతులను వేధించే ఆకతాయిల భరతం పట్టడానికి షీ టీం బలగాలు మొహరించనున్నాయి. చౌరస్తాలు, రద్దీ ప్రాంతాల్లో షీటీం పోలీసులు మఫ్టీలో ఉంటారు. యువతులను ఎవరైనా వేధిస్తే క్షణాల్లో అదుపులోకి తీసుకుంటారు.
శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే ఉపేక్షించం బోనాలు ప్రశాంతంగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం. తొక్కిసలాట జరగకుండా క్యూ లైన్లు పెంచాం. వీఐపీలు వచ్చినప్పుడు సాధారణ భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నాం. మెయిన్‌ కంట్రోల్‌ రూంతోపాటు మినీ కంట్రోల్‌ రూం కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఫీడ్‌ బ్యాక్‌ సమీక్షించుకుంటూ జాగ్రత్తలు తీసుకుంటాం. భద్రతాపరంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాం. శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే ఉపేక్షించం. ఆలయ అధికారులతో మాట్లాడాం. ప్రజల సహకారంతో బోనాల ఉత్సావాన్ని విజయవంతం చేస్తాం. - సుమతి, నార్త్‌జోన్‌ డీసీపీ