ఒకేసారి 256 మందితో.......

ఒకేసారి 256 మందితో.......

ఒకేసారి 256 మందితో.......
వాట్స్ యాప్ తన వినియోగదారులకు కొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటివరకు ఇందులో గ్రూప్ చాట్ లిమిటెడ్ గా ఉండేది. అంటే 100 మంది మాత్రమే ఒకేసారి గ్రూప్ చాట్ చేసుకునే వారు. ఇక నుంచి ఒకేసారి 256 మంది గ్రూప్ చాట్ చేసే అవకాశాన్ని కల్పిస్తోంది. అయితే ఈ పెంచిన గ్రూప్ చాట్ లిమిట్ v2.12.367 ఆండ్రాయిడ్ వెర్షన్లలోను, ఆపై అప్ డేట్ చేసిన ఫోన్లలోను మాత్రమే కనిపిస్తుందట. విండోస్, బ్లాక్ బెర్రీ తదితర ఫోన్లకు కూడా త్వరలో ఈ సదుపాయాన్ని విస్తరిస్తామని వాట్స్ యాప్ ప్రతినిధి ఒకరు తెలిపారు.