ఇంజినీరింగ్‌కు నూతన నిబంధనలు    

ఇంజినీరింగ్‌కు నూతన నిబంధనలు      

 ఇంజినీరింగ్ విద్యాసంస్థల గుర్తింపు, కాలేజీల్లో ప్రవేశాలకు సంబంధించి కొత్త నిబంధనలను ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) విడుదల చేసింది. ప్రస్తుతం ఉన్న నిబంధనలను సవరిస్తూ కొత్త మార్గదర్శకాలను ఏఐసీటీఈ ఖరారు చేసింది. 2018- 19 విద్యాసంవత్సరం నుంచి ఇవి అమలులోకి రానున్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రతి ప్రైవేట్, డీమ్డ్ యూనివర్సిటీలకు ఏఐసీటీఈ గుర్తింపు తప్పనిసరి. విద్యాసంస్థల విస్తీర్ణాన్ని పట్టణ ప్రాంతాల్లో 2.5 ఎకరాల నుంచి 1.5 ఎకరాలకు, గ్రామీణ ప్రాంతాల్లో అయితే 7.5 నుంచి 4 ఎకరాలకు తగ్గించింది. 

అదేవిధంగా ఇంజినీరింగ్, హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సులకు సంబంధించి ప్రతి 15 మంది విద్యార్థులకు ఒక అధ్యాపకుడు అనే నిబంధనను 1:20 మంది విద్యార్థులకు ఒక అధ్యాపకుడు ఉండేలా నిబంధనను సవరించింది. పీజీ స్థాయిలో 1:15గా నిర్ణయించారు. ప్రస్తుతం ఇంజినీరింగ్ కాలేజీల్లో కనీసం 48 ఎంబీపీఎస్ స్పీడ్‌తో కూడిన ఇంటర్నెట్ సదుపాయాన్ని కల్పించాలి. విద్యార్థుల సంఖ్య పెరిగితే ఇంటర్నెట్ స్పీడ్ కూడా పెంచాలి. దీనితో విద్యార్థులు ప్రాజెక్ట్ వర్క్‌ను వీలైనంత త్వరగా చేసుకొనే అవకాశం ఉంటుంది.