ఫిబ్రవరి 1 నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్

ఫిబ్రవరి 1 నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్

  హైదరాబాద్ : ఫిబ్రవరి ఒకటి నుంచి ఇంటర్మీడియట్ విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందుకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1,600 కేంద్రాలు ఏర్పాటుచేశామని ఇంటర్‌బోర్డు అధికారులు తెలిపారు. ఆన్‌లైన్‌లో పరీక్షలను నిర్వహించనున్నామని, దీనివల్ల ప్రశ్నాపత్రం లీక్ అయ్యే ప్రమాదం ఉండదని పేర్కొన్నారు. ఫస్టియర్ విద్యార్థులకు ఈ నెల 27 నైతిక, మానవ విలువల పరీక్ష, 29న పర్యావరణ విద్య పరీక్ష ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంటవరకు ఉంటుందని వివరించారు. తమ కళాశాలల్లో విద్యార్థులు హాల్‌టికెట్లు పొందవచ్చని తెలిపారు.