సీఐఎస్‌సీఈ స్కూళ్లలో పాస్ మార్కులు తగ్గింపు

సీఐఎస్‌సీఈ స్కూళ్లలో పాస్ మార్కులు తగ్గింపు

 కోల్‌కతా: ఈ విద్యాసంవత్సరం (2017-18) నుంచి 10వ, 12వ తరగతుల్లో పాస్ మార్కులను తగ్గిస్తున్నట్టు కౌన్సిల్ ఫర్ ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్ ఎగ్జామినేషన్ (సీఐఎస్‌సీఈ) వెల్లడించింది. ఈ మేరకు సీఐఎస్‌సీఈ కార్యదర్శి, సీఈవో గెర్రీ అరాథూన్ గురువారం ఆదేశాలు జారీచేశారు. పదోతరగతి (ఐసీఎస్‌ఈ) విద్యార్థుల పాస్ మార్కులను 35 శాతం నుంచి 33 శాతానికి.. పన్నెండో తరగతి (ఐఎస్‌సీ) విద్యార్థుల పాస్ మార్కులను 40 శాతం నుంచి 35 శాతానికి తగ్గిస్తున్నట్టు పేర్కొన్నారు. పాస్ మార్కుల తగ్గింపు ఇదే విద్యాసంవత్సరం నుంచి అమల్లోకి వస్తుందని వెల్లడించారు. ఈ నోటీసులను సీఐఎస్‌సీఈ ఆధ్వర్యంలోని అన్ని పాఠశాలలకు పంపించారు. పదోతరగతి పరీక్షలను ఫిబ్రవరి 26 నుంచి మార్చి 28 వరకు.. పన్నెండో తరగతి పరీక్షలను ఫిబ్రవరి 7 నుంచి ఏప్రిల్ 2 వరకు నిర్వహించనున్నారు. ఈ ఏడాది కొన్ని రాష్ర్టాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను బట్టి పరీక్షల తేదీలు మారే అవకాశం ఉన్నదని సీఐఎస్‌సీఈ అధికారులు వెల్లడించారు.