ఐఐటీల్లో మరో వెయ్యి సీట్లు

ఐఐటీల్లో మరో వెయ్యి సీట్లు

ఢిల్లీ: దేశంలోని ప్రతిష్టాత్మక విద్యా సంస్థలైన ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ)ల్లో 2018–19 విద్యా సంవత్సరంకిగాను 1000 సీట్లను పెంచే అవకాశం ఉందని, ఇందుకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ (ఎంహెచ్‌ ఆర్‌డీ) ఆమోదం తెలిపినట్లు తెలిసింది.

20 17–18 విద్యా సంవత్సరంలో ఐఐటీల్లో 400 సీట్లను పెంచిన కేంద్రం,2018–19 విద్యా సంవత్సరంలో 1000 సీట్లను పెంచేందుకు ఏర్పాట్లు చేస్తోంది.అయితే టాప్‌ ఐఐటీలైన ఢిల్లీ, బాంబే, మద్రాస్, ఖరగ్‌పూర్‌లలో కాకుండా ఇతర, కొత్తగా పెట్టిన ఐఐటీల్లో ఈ సీట్లను పెంచే అవకాశం ఉంది.

అయితే 2018–19 విద్యా సంవత్సరంలో అన్ని ఐఐటీల్లో బాలికల కోసం 14% సీట్లను పెంచాలని ఐఐటీల జాయింట్‌ అడ్మిషన్‌ బోర్డు (జేఏబీ) సిఫారసు చేసిన నేపథ్యంలో ఆ టాప్‌ ఐఐటీల్లోనూ సీట్ల సంఖ్యను పెం చాల్సి రావొచ్చని ఐఐటీ వర్గాలు పేర్కొంటు న్నాయి. ప్రస్తుతం ఐఐటీల్లో 10,998 సీట్లు అందుబాటులో ఉండగా పెరిగే సీట్లతో కలిపి 11,998సీట్లు అందుబాటులోకి రానున్నాయి.