ఇండియాన్స్ కు గూగుల్ స్కాలర్ షిప్ లు

ఇండియాన్స్ కు గూగుల్ స్కాలర్ షిప్ లు

టెక్నాలజీ లెర్నింగ్‌ ఫ్లాట్‌ఫాం ప్లూరల్‌సైట్‌, ఎడ్యుకేషన్‌ ఇనిస్టిట్యూషన్‌ ఉడాసిటీతో కలిసి గూగుల్‌ భాగస్వామ్యం ఏర్పరుచుకుంది. ఈ భాగస్వామ్యంలో కొత్త స్కాల్కర్‌షిప్‌ ప్రొగ్రామ్‌ను ప్రకటించింది. ఎమర్జింగ్‌ టెక్నాలజీలకు అనుగుణంగా భారతీయ యువతను తయారు చేసేందుకు ప్రముఖ సెర్చింజన్‌ దిగ్గజం గూగుల్‌ నిర్ణయం తీసుకుంది.

ఈ కొత్త స్కాలర్‌షిప్‌ ప్రొగ్రామ్‌ తో భారత్‌లో 20 లక్షల మంది డెవలపర్లను తయారు చేసే లక్ష్యంతో గూగుల్‌ ముందుకు వచ్చింది. ప్రపంచంలో భారత్‌ రెండో అతిపెద్ద ట్రైనింగ్ సెంటర్ గా అభివృద్ధి బాటలో ఉంది. 2021 వరకు అమెరికాను అధిగమించనుందని గూగుల్‌ డెవలపర్‌ ప్రొడక్ట్స్‌ గ్రూప్‌ అండ్‌ స్కిలింగ్‌ లీడ్‌ ఫర్‌ ఇండియా, విలియమ్‌ ఫ్లోరేన్స్‌ తెలిపారు. రానున్న మూడేళ్లలో దేశంలో కొత్తగా 20 లక్షల మంది ఆండ్రాయిడ్‌ డెవలపర్లకు గూగుల్‌ శిక్షణ ఇస్తుందని సీఈవో సుందర్‌ పిచాయ్‌ 2015లో ప్రకటించారు.

ఈ స్కాలర్‌షిప్‌తో లక్షా 30వేల మంది డెవలపర్లకు,  స్టూడెంట్లకు ట్రైనింగ్ ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగానే ప్లూరల్‌సైట్‌ టెక్నాలజీ లెర్నింగ్‌ ప్లాట్‌ఫామ్‌ ద్వారా లక్ష మందికి, ఉడాసిటీ ద్వారా మరో 30 వేల మందికి గూగుల్‌ స్కాలర్‌షిప్‌లను అందించనుంది. ఈ స్కాలర్‌షిప్‌ ద్వారా భారతీయ విద్యార్థులు లేటెస్ట్ టెక్నాలజీ విద్యను అభ్యసించడంతో పాటు మొబైల్‌, వెబ్‌ డెవలప్‌మెంట్‌, మెషిన్‌ లెర్నింగ్‌, వర్చ్యూవల్‌ రియాల్టీ, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్సీ, క్లౌడ్‌ ప్లాట్‌ఫామ్‌లలో ఉద్యోగావకాశాలు పొందే అవకాశముంది.