ఇంటర్‌లో గ్రేడింగ్ విధానం

ఇంటర్‌లో గ్రేడింగ్ విధానం

 విద్యార్థులపై ఒత్తిడిని తగ్గించేందుకు ఇంటర్ లో మార్కుల విధానానికి బదులు గ్రేడింగ్ విధానం తీసుకురావాలని ఇంటర్ విద్యాశాఖ చర్యలు ప్రారంభించింది. గతం లో విద్యార్థులకు మార్కుల విధానం వల్ల ఒక కళాశాలకు మరో కళాశాలకు పోటీ పెరిగింది. దీంతో విద్యార్థులపై చదువు, చదు వు అంటూ ఆయా ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు తీవ్ర ఒత్తిడిని పెంచుతున్నాయి. ఇటీవల కాలంలో ప్రైవేట్, కార్పొరే ట్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు తమ మానసిక స్తైర్యా న్ని కోల్పోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్న సంఘటనలు చో టు చేసుకున్నాయి. 

దీనిని నివారించేందుకు విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలల యాజమన్యాలు, విద్యార్థులు తల్లిదండ్రులతో తెలంగాణ విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజన్ ఆర్ ఆచార్య సమావేశం నిర్వహించారు. సందర్భంగా విద్యార్థుల ఆత్మహత్యలపై సవివరంగా సుదీర్ఘంగా చర్చించారు. ప్రైవేట్ కళాశాలల్లో ఎప్పుడు ర్యాంకులు, మార్కు లు అంటూ వేధించడం, ఆటలు, మానసిక ఉల్లాసం కలిగే చ ర్యలు లేకపోవడం వంటి వాటితో విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి గు రై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారనే నిర్ణయానికి వచ్చారు. ఎ క్కువగా భౌతిక, రసాయన శాస్ర్తాల్లో పాఠ్యప్రణాళిక భారంగా ఉన్నందును దానిని తగ్గించేందకు అవసరమైన చర్యలు తీసుకోనున్నారు. 

విద్యార్థులను ఒత్తిడి నుంచి దూరం చేసేందుకు మార్కులు విధానానికి బదులు గ్రేడింగ్ విధానాన్ని తీసుకువచ్చేందుకు కసరత్తు ప్రారంభించారు. గత సంవత్సరం పదో తరగతి చదివే విద్యార్థులకు మార్కుల విధానాన్ని తీసివేసి గ్రేడింగ్ విధానం తీసుకువచ్చారు. ఈ విధానం వల్ల విద్యార్థులలో పోటీతత్వం తగ్గి స్వేచ్ఛగా చదువుకునే వీలు కలిగింది. పాఠశాలల మధ్య పోటీ కూడా తగ్గింది. దీంతో ఇంటర్‌లో కూడా గ్రేడింగ్ విధానం తీసుకురానున్నారు. అదే విధంగా ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలల్లో ప్రతి కళాశాల విద్యార్థులకు ఒత్తిడి తగ్గించేందకు తప్పనిసరిగా సైకాలజిస్టు(మానసిక కౌన్సిలర్)ను నియమించుకోవాలనే నిబంధన తీసుకురానున్నారు. కళాశాలలో సైకాలజిస్టు తప్పనిసరిగా ప్రతి రోజు గంట నుంచి రెండు గంటల సమయం కేటాయించాలి. 

అదే విధంగా బాలికల కళాశాలకు మహిళా సైకాలజిస్టును నియమించాలి. గతంలో ప్రైవేట్, కార్పొరేట్ కాలేజీలలో చదువుతున్న విద్యార్థులకు ఏర్పా టు చేసిన వసతిగృహాలను ఆయా పాఠశాలల యాజమన్యాలే పర్యవేక్షణ చేసేవి. ఇక నుంచి ఇంటర్ బోర్డు పరిధిలోకి వసతిగృహాలను తీసుకుని అన్ని కళాశాలల వసతిగృహాలను త నిఖీ చేయనున్నారు. అదే కాకుండా కాలేజీలలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు, ఒత్తిడి వంటి విషయాలను పరిశీలించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయనున్నారు.

ఇంటర్ బోర్డు తీసుకువచ్చే విద్యా క్యాలెండర్ ప్రకారం తరగతులను నిర్వహించాలి. ఉ.9.30 గంటల నుంచి మధ్యాహ్నం 4.30 గంటల వరకు తరగతులను నిర్వహించాలి. తమ కళాశాలల్లో వచ్చిన ర్యాంకులను ప్రచారం చేసుకునేందుకు మీడియాకు పెద్ద ఎత్తున ప్రకటనలు ఇచ్చి ప్రచారం చేయించుకుంటున్నారు. ఇక నుంచి ఎవరైనా ప్రకటనలు ఇచ్చి ప్రచారం నిర్వహిస్తే వారిపై కఠిన చర్యలను ప్రభుత్వం తీసుకోనున్నది.