మే 2 నుంచి 7 వరకు ఎంసెట్

మే 2 నుంచి 7 వరకు ఎంసెట్

  హైదరాబాద్ : రాష్ట్రంలోని ఇంజినీరింగ్ అగ్రికల్చర్, ఫార్మసీ, హార్టీకల్చర్ కాలేజీల్లో సీట్ల భర్తీకి మే 2 నుంచి 7 వరకు ఆన్‌లైన్‌లో ఎంసెట్ నిర్వహించనున్నామని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు. మంగళవారం నోటిఫికేషన్‌ను విడుదల చేస్తామని పేర్కొన్నారు. ఈ మేరకు ఎంసెట్-2018 అడ్మిషన్ కమిటీ సోమవారం జేఎన్‌టీయూహెచ్‌లో సమావేశమైంది. 2018-19 విద్యాసంవత్సరానికి నిర్వహించనున్న ఎంసెట్ ప్రవేశపరీక్ష, షెడ్యూల్ గురించి కమిటీసభ్యులు చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉన్నత విద్యా మండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి, జేఎన్‌టీయూ వీసీ ప్రొఫెసర్ వేణుగోపాల్‌రెడ్డి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ యాదయ్య, రెక్టార్ ప్రొఫెసర్ దామోదర్, ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి వివరాలు వెల్లడించారు.