వచ్చే నెల  టెక్నికల్ టీచర్స్ ట్రైనింగ్ ఎగ్జామ్స్

వచ్చే నెల  టెక్నికల్ టీచర్స్ ట్రైనింగ్ ఎగ్జామ్స్

వచ్చే నెల 17న టెక్నికల్ టీచర్స్ ట్రైనింగ్ కోర్సు థియరీ ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి జి. రమేష్ పేర్కొన్నారు.మే, జూన్ ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయిన విద్యార్థులకు ఇదో మంచి అవకాశం అని జి.రమేష్ తెలిపారు .

టెక్నికల్ టీచర్స్ ట్రైనింగ్ కోర్సు థియరీ ఎగ్జామ్స్ పేపర్-1 ఎడ్యూకేషనల్ సైకాలజీ అండ్ స్కూల్ అడ్మినిస్ట్రేషన్ ఉదయం 11 నుంచి 1 గంట వరకు, పేపర్-2 మెథడ్స్ ఆఫ్ టీచింగ్ (జనరల్) మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు, పేపర్-3 మెథడ్స్ ఆఫ్ టీచింగ్ (స్పెషల్) మధ్యాహ్నం 3:30 నుంచి 4:30 వరకు పరీక్ష నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.

అభ్యర్థులు వచ్చే నెల 8 నుంచి www.bsetelangana.org వెబ్ సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలన్నారు.