విద్యార్థులను చంపుతున్న నారాయణ విద్యాసంస్థలు

 విద్యార్థులను చంపుతున్న నారాయణ విద్యాసంస్థలు
హైదరాబాద్: ఇంటర్ విద్యార్థిని సాయి ప్రజ్వల మిస్సింగ్ వ్యవహారం కలకలం రేపుతోంది. హైదరాబాద్‌ సమీపంలోని బండ్లగూడ నారాయణ కాలేజీలో బైపీసీ లాంగ్‌ టర్మ్‌ కోచింగ్‌ తీసుకుంటుంది. కరీంనగర్‌ జిల్లా గోదావరి ఖని మండలం అడ్డగుంటపల్లికి ఆమె తల్లిదండ్రులు ప్రజ్వల తీవ్ర ఒత్తిడికి గురవుతున్నట్లు గుర్తించి కొద్ది రోజుల క్రితం నగరంలోని బంధువుల ఇంటికి తీసుకెళ్లారు. సాయి ప్రజ్వల లేఖ రాసిపెట్టి ఇంట్లో నుంచి వెళ్లిపొయింది. దీంతో సాయిప్రజ్వల కోసం కుటుంబ సభ్యులు వెతుకుతున్నారు.దీనిపై ఆమె తండ్రి రాచకొండ మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇచ్చిన ఫిర్యాదుతో విచారణ చేస్తున్నారు పోలీసులు. కాలేజ్ లో ఒత్తిళ్ల వల్లే సాయి ప్రజ్వల ఎవరికీ చెప్పకుండా ఎక్కడికో వెళ్లినట్టు అనుమానిస్తున్నారు. సాయి ప్రజ్వల ఇంటి నుంచి వెళ్తుండగా కాలనీలోని ఓ ఇంట్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో విజువల్స్ రికార్డయ్యాయి.సాయిప్రజల్వ రాసి లేఖ సంచలనం అయ్యింది. నారాయణ కాలేజీని మూసివేయాలని కోరింది. చదువు పేరుతో విద్యార్థులను చంపుతోందని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. నారాయణ కాలేజీ, హాస్టల్ లో చదివే పిల్లలు ఎంతో మానసిక ఆందోళనకు గురవుతున్నారని చెప్పింది. ఇలాంటి నారాయణ కాలేజీని మూసివేయాలని కోరింది. తీవ్ర ఒత్తిడికి గురవుతున్నట్లు లేఖ రాసి కనిపించకుండా పోయింది.కాలేజీలో ఏదో జరగటం వల్లే తమ బిడ్డ వెళ్లిపోయిందని విద్యార్థిని తండ్రి విద్యాగిరి శ్రీనివాస్‌ ఆరోపించారు. ఇటీవల కడప నారాయణ కాలేజీలో పావని అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం తెలిసిందే. ఒక్క ఈ వారం పది రోజుల్లోనే 8 మంది ఆత్మహత్య చేసుకున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో బోధపడుతోంది. ఈ మూడేళ్లలో ఒక్క ఏపీలోనే 60 మంది ఇంటర్‌ విద్యార్ధులు ఆత్మహత్యలకు పాల్పడటం గమనార్హం.