బాత్‌ రూమ్‌ క్లిప్‌పై నటి వివరణ

బాత్‌ రూమ్‌ క్లిప్‌పై నటి వివరణ

 సోషల్‌ మీడియా అప్‌డేట్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలనే విషయం మరోసారి రుజువైంది. హిందీ సీరియల్‌ నటి సారా ఖాన్‌(28).. బాత్‌ టబ్‌లో నగ్నంగా స్నానం చేస్తున్న ఓ క్లిప్‌, కొన్ని ఫోటోలు వైరల్‌ కావటం తెలిసిందే. దీంతో పలువురు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అయితే తన సోదరి చేసిన తప్పిదంతోనే అది జరిగిందంటూ సారా వివరణ ఇచ్చుకున్నారు.ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉన్న సారా ఖాన్‌.. ఆమె సోదరి ఆర్యా అక్కడి సరదా మూమెంట్స్‌ను సోషల్‌ మీడియాలో అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ క్రమంలో మూడు, నాలుగు రోజుల రోజుల క్రితం సారా సోదరి అర్యా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను పోస్ట్‌ చేశారు. బాత్‌ టబ్‌లో సారా నగ్నంగా స్నానం చేస్తున్న వీడియో అది. అది చూసి నెటిజన్లు ఖంగుతిని ‘సిగ్గు లేదా?’ అంటూ సారాను తిట్టి పోశారు. అయితే కాసేటికే ఆర్య ఆ వీడియోను డిలేట్‌ చేశారు. 

సారా స్పందన... అయితే అప్పటికే వీడియోలోని స్క్రీన్‌ షాట్లు కొన్ని నెట్‌లో వైరల్‌ అయ్యాయి. దీంతో జరిగిన పొరపాటుపై సారా మీడియా ముందుకొచ్చారు. మద్యం మత్తులోనే తన సోదరి అలా చేసిందని, సరదా కోసం చేయబోతే అలా వికటించిందని ఆమె ఓ జాతీయ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ‘ప్రపంచం ఇప్పుడు ఎంతో వేగంగా ఉంది. సోషల్‌ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రతీ ఒక్కరి అప్‌డేట్‌లు వేగంగా వచ్చేస్తున్నాయి. ముఖ్యంగా సెలబ్రిటీల విషయంలో ప్రతీ ఒక్కరూ గమనిస్తున్నారు. ఇలాంటి సమయంలో అప్రమత్తంగా ఉండాల్సింది మేమే. లేకపోతే ఘోరాలు జరిగిపోయే ప్రమాదం ఉంది. ఇక నుంచి అలాంటి పోరపాట్లు జరగకుండా చూసుకుంటా’ అని సారా తెలిపారు. కాగా, సారా ఖాన్‌ పలు సీరియళ్లతోపాటు బిగ్‌ బాస్‌-4 సీజన్‌లో కంటెస్టెంట్‌గా కూడా పాపులర్‌ అయ్యారు. ప్రస్తుతం ‘వో అప్నా సా’ సీరియల్‌లో ఆమె నటిస్తున్నారు.