చిన్నారి కోరిక తీర్చిన స‌ల్మాన్ ఖాన్

చిన్నారి కోరిక తీర్చిన స‌ల్మాన్ ఖాన్

  బాలీవుడ్ కండ‌ల వీరుడు స‌ల్మాన్ ఖాన్ న‌టుడిగానే కాదు సామాజిక స్పృహ ఉన్న మంచి వ్య‌క్తిగా అభిమానుల మ‌న‌సులు గెలుచుకుంటున్నాడు. ‘బీయింగ్‌ హ్యూమన్‌’ పేరిట సల్మాన్‌ ఓ ఎన్జీవోను స్థాపించి ఆ సంస్థ ద్వారా అనేక విరాళాలు సేక‌రిస్తున్నారు. అయితే ముంబైలోని టాటా మెమోరియ‌ల్ ఆసుప‌త్రిలో క్యాన్సర్‌తో బాధ‌ప‌డుతూ చికిత్స పొందుతున్న బాలుడు స‌ల్మాన్‌కి వీరాభిమాని కాగా, ఒక‌సారి స‌ల్మాన్‌ని క‌ల‌వాల‌నుంద‌ని కోరాడు. ఈ విష‌యం బాలుడి తల్లి మేనేజ‌ర్ ద్వారా స‌ల్మాన్‌కి విష‌యాన్ని చేర‌వేసింది. ఈ విష‌యం తెలుసుకున్న స‌ల్మాన్ ఆసుప‌త్రికి వెళ్లి బాలుడితో కొద్ది సేపు ముచ్చ‌టించారు. వార్డులో ఉన్న ఇత‌ర చిన్నారుల‌ని కూడా ప‌ల‌క‌రించాడు. వీటికి సంబంధించిన స‌న్నివేశాలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. స‌ల్మాన్ ప్ర‌స్తుతం అలీ అబ్బాస్ జాఫ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న భార‌త్ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో కత్రినా కైఫ్‌ కథానాయికగా నటిస్తున్నారు. వచ్చే ఏడాది రంజాన్‌కు ఈ చిత్రం విడుదల కాబోతోంది. మ‌రో వైపు ‘బిగ్‌బాస్‌’ సీజన్‌ 12కు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు.