దక్షిణాది స్టార్లు చాలా ప్రొఫెషనల్స్‌

దక్షిణాది స్టార్లు చాలా ప్రొఫెషనల్స్‌

  బాలీవుడ్‌ హీరో అక్షరు కుమార్‌ దక్షిణాది స్టార్ల పనితీరును ప్రశంసించారు. ఇటీవల ఆయన రజనీకాంత్‌తో కలసి '2.ఓ'లో నటించారు. ఇందులో ప్రతినాయకుడిగా చేశారు. ఇక్కడ స్టార్స్‌తో పనిచేసిన అనంతరం దక్షిణాది స్టార్లు గురించి ఆయన మాట్లాడారు. బాలీవుడ్‌ కంటే దక్షిణాది నటులకు సమయ పాలన, వృత్తి పట్ల చాలా నిబద్ధతగా ఉంటారని ఆయన పేర్కొన్నారు. ''మా (బాలీవుడ్‌) కంటే దక్షిణాది వాళ్లు సాంకేతికంగా అడ్వాన్సడ్‌. మా కంటే వాళ్లు చాలా ప్రొఫెషనల్స్‌. సినిమా షూటింగ్‌ సమయం 7:30కి అని నిర్ణయిస్తే అదే సమయానికి చిత్రీకరణ ప్రారంభమైపోతుంది. కానీ బాలీవుడ్‌ మాత్రం 7:30 అంటే 9:30కి వస్తారు. అక్కడ సూపర్‌స్టార్స్‌ కూడా చెప్పిన సమయానికే సెట్‌పైకి వచ్చేస్తారు'' అని ఓ గ్రూప్‌ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు అక్షరు. బాలీవుడ్‌లోకి వచ్చే కొత్తవారంతా దక్షిణాదిలో కనీసం ఐదు సినిమాలైనా చేసిన తర్వాతే రావాలని సూచించారు. ''చాలా నేర్చుకోవచ్చు. నేను కొన్నిసార్లు అనుకుంటూ ఉంటాను. కొత్తగా వచ్చేవారంతా కచ్చితంగా అక్కడ ఐదు సినిమాలు చేయాలని..అప్పుడే ఇక్కడకి (బాలీవుడ్‌)రావాలి. ఓ రోజులో 30 నుంచి 40 షాట్స్‌ తీస్తారు. అందులో మనం 12 నుంచి 13 షాట్స్‌కు మేనేజ్‌ చేయగలం. ఇలా మిగిలిన వారైతే చేయరు'' అని అన్నారు.