దీపావ‌ళి శుభాకాంక్ష‌లు తెలిపిన సోనాలి బింద్రే

దీపావ‌ళి శుభాకాంక్ష‌లు తెలిపిన సోనాలి బింద్రే

  గత కొంత కాలంగా కాన్సర్ వ్యాధితో బాధపడుతున్న సోనాలి బింద్రే ప్రస్తుతం న్యూయార్క్‌లో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఆమెకు హై గ్రేడ్ మెటా స్టేటిక్ కాన్సర్ సోకిందనే వార్త సినీ లోకాన్ని నిరాశలో నెట్టేసింది. సోనాలి త్వరలో కోలుకోవాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు. మరోవైపు.. కాన్సర్ చికిత్స తీసుకుంటూనే సోనాలీ ఎప్పటికప్పుడు ప్రేక్షకులతో టచ్‌లో ఉంటోంది. సోషల్ మీడియాలో ఆమె పెట్టిన పోస్ట్‌లు ఆమె అభిమానులను ఒకింత ఉద్వేగానికి గురి చేస్తున్నప్పటికీ.. ఇంత బాధలో కూడా సోనాలీ తమతో రెగ్యులర్‌గా టచ్‌లో ఉండటం వారికి కాస్త ఊరటనిస్తోంది.

 కాగా ఈ పరిస్థితుల్లో కూడా ప్రతీ పండుగకి పలకరిస్తున్న సోనాలీ.. తాజాగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేసింది. ‘‘ముంబై కంటే న్యూయార్క్‌లో దీపావళి కాస్త లేటుగా వస్తుంది. అందుకే లేటుగా విషెస్ చెబుతున్నా.. ప్రస్తుతం మేమంతా భారత దేశంలో లేము. గుండెల్లో నిలిచేలా ఇక్కడే (న్యూయార్క్‌) చిన్న పూజా కార్యక్రమం చేసుకున్నాం. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అందరికీ మంచి ఆరోగ్యం, సంపద చేకూరాలని కోరుకుంటున్నా’’ అని ట్వీట్‌లో పేర్కొంటూ.. తాను దీపాలు వెలిగిస్తున్న ఫొటోలను పోస్ట్ చేసింది సోనాలీ.