డ్రగ్స్ కేసులో సెలెబ్రిటీలపై ఛార్జ్ షీట్ వేసిన సిట్

డ్రగ్స్ కేసులో సెలెబ్రిటీలపై ఛార్జ్ షీట్ వేసిన సిట్

   గతేడాది టాలీవుడ్ ని కుదిపేసిన వార్తల్లో డ్రగ్స్ ఉదంతం ఒకటి. తెలుగు సినీ పరిశ్రమలోని చాలా మంచి ప్రముఖులు డ్రగ్స్ కు వ్యసనపరులైనట్లు సిట్ అధికారులు కొంతందిని విచారించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో దాదాపు ఇరవై మంది దాకా విచారించి, కొన్ని గంటలపాటు ప్రశ్నల వర్షం సంధించి, చాలా సమాచారాన్ని సేకరించారు.అప్పట్ల విచారణకు హాజరైన ప్రతి ఒక్కరి నుండి చేతి గోళ్లు, వెట్రుకలు, రక్తం తదితర వాటిని శాంపిల్స్ గా తీసుకున్నారు. ఇక ఫోరెన్సిక్ అధికారులు వాటిపై పరీక్షలు జరిపి ఎవరెవరు డ్రగ్స్ వాడుతున్నారో తెలుసుకున్నారు. ఈ విలువైన సమాచారంపై హైదరాబాద్ సిట్ అధికారులు..ఓ ప్రముఖ దర్శకుడు, ఇద్దరు హీరోలపై ఛార్జ్ షీట్ ఓపెన్ చేసినట్లుగా తెలుస్తోంది. దీనిపై సిట్ చీఫ్ అకున్ సబర్వాల్ మాట్లాడుతూ ఇప్పటివరకు కేవలం ముగ్గురి శాంపిల్స్ నివేదికలు మాత్రమే వచ్చాయి. త్వరలోనే మిగిలిన వారి శాంపిల్స్ రానున్నాయి. ఆ నివేదికలు వచ్చాక మిగిలిన వారిపై కూడా ఛార్జ్ షీట్ ఓపెన్ చేస్తామని తెలిపారు.