మ‌రోసారి తండ్రైన ప‌వ‌న్

మ‌రోసారి తండ్రైన ప‌వ‌న్

హైదరాబాద్: మరోసారి తండ్రైన పవన్ కళ్యాణ్. రేణూ దేశాయ్ ని రెండో వివాహం చేసుకొని అకీరా, ఆద్య అనే ఇద్దరు చిన్నారులకి పవన్ కళ్యాణ్ తండ్రి అయిన‌ సంగ‌తి తెలిసిందే. రేణూ దేశాయ్ తో విడాకుల త‌ర్వాత రష్యన్ లేడి అన్నా లెజీనావొని మూడో పెళ్ళి చేసుకున్నాడు పవన్. వీరికి పొలేనా అనే 3 ఏళ్ళ పాప ఉంది.

 తాజాగా అన్నా లెజీనావొ ఒక్క బిడ్డకి జ‌న్మ‌నిచ్చింద‌ని తెలుస్తుంది. ప‌వ‌న్ త‌న కొడుకుని ఎత్తుకొని దిగిన ఫోటో ఒక‌టి వైర‌ల్ కావ‌డంతో అభిమానులు మెగా ఫ్యామిలీలోకి మ‌రో వ్యక్తి ఎంట‌ర‌య్యాడంటూ ఈ ఫోటోని సోష‌ల్ మీడియాలో ఫుల్ వైర‌ల్ చేస్తున్నారు.