మోస్ట్‌ డిజైరబుల్‌ లిస్ట్‌లో ప్రభాస్, మహేశ్‌

మోస్ట్‌ డిజైరబుల్‌ లిస్ట్‌లో ప్రభాస్, మహేశ్‌

  ముంబై: ప్రముఖ దినపత్రిక టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా ప్రకటించిన మోస్ట్‌ డిజైరబుల్‌ లిస్ట్‌లో టాలీవుడ్‌ స్టార్‌ హీరోలు ప్రభాస్‌, మహేశ్‌ బాబు స్థానం దక్కించుకున్నారు. 2017 ఏడాదికి గానూ విడుదల చేసిన జాబితాలో బాలీవుడ్‌ నటుడు రణ్‌వీర్‌ సింగ్‌ తొలి స్థానంలో నిలవగా.. ప్రభాస్‌ రెండో ప్లేస్‌లో నిలిచారు. టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, బాలీవుడ్‌ హీరోలు హృతిక్‌ రోషన్‌, సిధార్థ్‌ మల్హోత్రాలు 3,4,5వ స్థానాల్లో నిలిచారు.

టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు 6వ స్థానంలో నిలవగా..  దగ్గుబాటి రానా ఏడో స్థానం దక్కించుకున్నారు. మళయాళం యువ హీరో దుల్కర్‌ సల్మాన్‌ 9వ స్థానంలో నిలిచారు. హైదరాబాద్‌ యువ మోడల్‌ బషీర్‌ అలీ 17వ స్థానం దక్కించుకున్నాడు. పాపులారిటీ, క్రేజ్‌ను ఆధారంగా చేసుకుని మొత్తం 50 మంది పేర్లతో ది టైమ్స్‌ మోస్ట్‌ డిజైరబుల్‌ పేరిట టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా ఈ జాబితాను విడుదల చేస్తుంటుంది. బాహుబలి సిరీస్‌ మూలంగా ప్రభాస్‌ పేరు దేశం మొత్తం పాకిపోగా.. ఫ్యాన్స్‌ ఫాలోయింగ్‌ విపరీతంగా పెరిగిపోయింది. ప్రస్తుతం ప్రభాస్‌ సాహో చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. శ్రద్ధాకపూర్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి సుజిత్‌ దర్శకుడు. వచ్చే ఏడాది సాహో ప్రేక్షకుల ముందుకు రానుంది.