ఎన్టీఆర్‌ ఇలా మారిపోయాడేంటి..?

ఎన్టీఆర్‌ ఇలా మారిపోయాడేంటి..?

  దర్శకధీరుడు రాజమౌళి మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌, యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో ఓ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఆర్‌ఆర్‌ఆర్‌ అనే వర్కింగ్‌ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవల ప్రారంభమైంది. తొలి షెడ్యూల్‌లో ఎన్టీఆర్‌, చరణ్‌లపై భారీ యాక్షన్‌ సీన్స్‌ చిత్రీకరించారు.అయితే తాజాగా ఈ సినిమాలో ఎన్టీఆర్‌ లుక్‌ ఫిలిం సర్కిల్స్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. ఇటీవల అరవింద సమేత సినిమాలో సిక్స్‌ప్యాక్‌ లుక్‌లో అదరగొట్టిన ఎన్టీఆర్‌, ఆర్‌ఆర్‌ఆర్‌లో భారీ కాయంతో కనిపించనున్నాడట. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ వంద కేజీలకుపైగా బరువు పెరిగినట్టుగా ప్రచారం జరుగుతోంది. భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా  2020లో ప్రేక్షకుల ముందుకు రానుంది.