పండుగ వేళ.. సోనాలి ఎమోషనల్ ట్వీట్

పండుగ వేళ.. సోనాలి ఎమోషనల్ ట్వీట్

  గత కొంతకాలంగా కాన్సర్‌తో బాధ పడుతున్న హీరోయిన్ సోనాలి బింద్రే వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ ఎమోషనల్ ట్వీట్ చేసింది. ప్రస్తుతం న్యూయార్క్‌లో కాన్సర్ చికిత్స పొందుతున్న ఈమె.. తన కుమారుడు వినాయక పూజ చేస్తున్న ఫోటోలను పోస్ట్ చేస్తూ ఎమోషనల్‌గా ఫీల్ అయింది.

‘‘నాకు ఎంతో ఇష్టమైన పండుగ వినాయక చవితి. ప్రతీ సంవత్సరం లాగే ఈ సారి కూడా మా ఇంట్లో వినాయక పూజలు జరిగాయి. కానీ నేను మాత్రం అక్కడ లేను. పండుగ సెలెబ్రేషన్స్ మిస్ అవుతున్నా. ఆ దేవుడి ఆశీస్సులు నాకు ఎప్పటికీ ఉంటాయి. ప్రతీ ఒక్కరూ ఆ దేవుడి ఆశీస్సులతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు’’ అని ట్యాగ్ చేసింది సోనాలి. అయితే ఈ ట్వీట్ చూసిన నెటిజన్స్ స్పందిస్తూ.. ‘సోనాలి.. మీ ఆరోగ్యం త్వరగా కుదుట పడాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాం’ అంటూ పెద్ద ఎత్తున మెసేజీలు పెడుతున్నారు. వచ్చే ఏడాది మీ కుటుంబ సభ్యులతో వినాయక చవితి జరుపుకోవాలని కోరుకుంటున్నాం అని పేర్కొంటూ వినాయక్ చవితి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.