పోలీసులను ఆశ్రయించిన హీరోయిన్‌

పోలీసులను ఆశ్రయించిన హీరోయిన్‌

  తమ్ముడు, నరసింహానాయుడు లాంటి సూపర్‌ హిట్ సినిమాల్లో నటించిన హీరోయిన్‌ ప్రీతీ జంగానియా గుర్తుండే ఉంటుంది. పెళ్లి తరువాత సినిమాలకు గుడ్‌బై చెప్పేసిన ప్రీతీ ప్రస్తుతం ముంబైలో నివాసముంటున్నారు. చాలా కాలంగా మీడియాకు దూరంగా ఉంటున్న ఈ అమ్మడు మరోసారి వార్తల్లో నిలిచారు.తన ఏడేళ్ల కొడుకుపై చేయి చేసుకున్నాడన్న కారణంతో పక్క అపార్ట్‌మెంట్‌లో నివాసముండే వ్యక్తిపై పోలీసు కంప్లయింట్ ఇచ్చారు ప్రీతీ. అపార్ట్‌మెంట్‌లో పిల్లలంతా కలిసి ఆడుకునే సమయంలో పిల్లల మధ్య గొడవ జరగగా.. ఓ వృద్ధుడు తన ఏడేళ్ల కొడుకుపై చేయి చేసుకోవటంతో పాటు అపార్ట్‌మెంట్‌ నుంచి బయటకు గెంటివేశారంటూ పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు.  పోలీసులు ఇరు కుంటుంబాలకు సర్దిచెప్పి పంపించినట్టుగా తెలుస్తోంది.