ప్రియాంక తర్వాత స్థానం ఎవరిదో తెలుసా..?

ప్రియాంక తర్వాత స్థానం ఎవరిదో తెలుసా..?

 ప్రియాంక చోప్రా ఏషియా సెక్సీయెస్ట్ ఉమెన్స్ జాబితాలో టాప్‌లిస్ట్‌లో చోటు సాధించింది. ప్రియాంకతో పాటు నియా శర్మ కూడా ఈ లిస్ట్‌లో చోటు దక్కించుకున్నది. యునైటెడ్ కింగ్‌కు చెందిన వార్త పత్రిక ఈస్ట్రర్న్ ఐ నిర్వహించిన పోల్‌లో ఈ విషయం వెల్లడయింది. టాప్ 50 సెక్సీయెస్ట్ ఏషియన్ ఉమెన్స్ లిస్ట్‌లో నియా రెండో స్థానం సంపాదించింది. ఇరవై ఆరేళ్ల ఈ బుల్లితెర భామ పలు టీవీ సీరియళ్లలో నటించింది. కమర్షియల్ యాడ్‌లలో తన అందచందాలను ఆరబోసింది. ఫియర్ ఫ్యాక్టరీ ఖత్రోం కే ఖిలాడీ గేమ్ షోలో పాల్గొని టాప్ 5 ఫైనలిస్ట్‌లో ఒకరిగా నిలిచింది. మాస్ కమ్యూనికేషన్‌లో డిగ్రీ పట్టా అందుకున్న నియా ప్రస్తుతం విక్రమ్ చేస్తున్న ట్విస్ట్ అనే వెబ్‌సిరీస్ నటిస్తున్నది.