రాకేశ్‌ రోషన్‌కు కేన్సర్‌

రాకేశ్‌ రోషన్‌కు కేన్సర్‌

 నటుడు, నిర్మాత, దర్శకుడు, హృతిక్‌ రోషన్‌ తండ్రి రాకేశ్‌ రోషన్‌ గొంతు కేన్సర్‌తో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని హృతిక్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా వెల్లడించారు. 'ఈరోజు ఉదయం ఫొటో దిగాలనుందని నాన్నను అడిగాను. సర్జరీ రోజు కూడా ఆయన జిమ్‌కు రావడం మానరని తెలుసు. నాకు తెలిసినంత వరకు ఆయన చాలా దృఢమైన వ్యక్తి. కొన్ని వారాలుగా గొంతు కేన్సర్‌తో బాధపడుతున్నారు. కానీ ఆయన క్యాన్సర్‌తో పోరాడుతూనే సంతోషంగా జీవిస్తున్నారు. కుటుంబంలో ఆయనలాంటి లీడర్‌ ఉన్నందుకు మేమెంతో అదృష్టవంతులం. 'లవ్యూ డాడ్‌' అని ఆ పోస్టులో పేర్కొంటూ జిమ్‌లో రాకేశ్‌తో దిగిన ఫొటోను షేర్‌ చేశారు హృతిక్‌. రాకేశ్‌ త్వరగా కోలుకోవాలని, ఈ సవాలును ధైర్యంగా ఎదుర్కోగలరని తాను నమ్మతున్నట్టు ప్రధాని నరేంద్ర మోడీ ఈ సందర్భంగా ట్వీట్‌ చేశారు. కొన్ని నెలల క్రితం సోనాలి బింద్రే తనకు మెటాస్టేటిక్‌ కేన్సర్‌ ఉందని వెల్లడిస్తూ అభిమానులను షాక్‌కు గురిచేశారు. మరోపక్క బాలీవుడ్‌ నటుడు రిషి కపూర్‌ అనారోగ్య సమస్యతో అమెరికాలో చికిత్స పొందుతున్నారు. ఆయన కూడా క్యాన్సర్‌తో బాధపడుతున్నారని కొంతకాలంగా వార్తలు వెలువడుతున్నాయి.