షూటింగ్ లో గాయపడ్డ  హీరోయిన్..!!

షూటింగ్ లో గాయపడ్డ  హీరోయిన్..!!

 తమిళంలో హన్సిక టాప్ హీరోయిన్ గా దూసుకుపోతున్నది.  ప్రస్తుతం ఈ యాపిల్ బ్యూటీ మహా అనే హర్రర్ జానర్ సినిమా చేస్తున్నది.  ఈ సినిమా షూటింగ్ సమయంలో హన్సిక గాయడినట్టు తెలుస్తోంది.  యాక్షన్ సీన్స్ చిత్రీకరించే సమయంలో స్లిప్ కావడంతో కిందపడింది.  చేతికి గాయం అయ్యింది.  గాయంతోనే హన్సిక యాక్షన్స్ సీక్వెన్స్ కంప్లీట్ చేసినట్టు తెలుస్తోంది.  మహా హన్సికకు 50వ సినిమా.  జమీల్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.  గిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు.  టాలీవుడ్ లో అల్లు అర్జున్ దేశముదురు సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.  టాలీవుడ్ లో అనేక విజయవంతమైన సినిమాల్లో నటించిన ఈ బ్యూటీ, కోలీవుడ్ లో టాప్ స్పీడ్ తో దూసుకుపోతున్నది.