‘స్లమ్ డాగ్ మిలియనీర్’ హీరోయిన్ చిట్‌చాట్

‘స్లమ్ డాగ్ మిలియనీర్’ హీరోయిన్ చిట్‌చాట్

 ముంబై: స్లమ్ డాగ్ మిలియనీర్ చిత్రంతో ఓవర్‌నైట్ పెద్ద స్టార్ సెలబ్రిటీ అయిపోయింది ఫ్రీదా పింటో. పదేళ్ల క్రితం బోయ్ లే దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్లు వసూలు చేసింది. ఫ్రీదా పింటో ఈ సినిమా తర్వాత రైజ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్, త్రిష్ణ, డిజర్ట్ డ్యాన్సర్ వంటి అంతర్జాతీయ చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత ఈ హీరోయిన్ విదేశీ సినిమాలతో బిజీ అయిపోయి భారత సినిమాలకు దూరమైంది.

సుదీర్ఘ విరామం తర్వాత ఈ ఏడాది లవ్ సోనియా చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. తానేదో మొక్కుబడిగా సినిమాలు చేయనని చెప్పింది ఈ భామ. మసాలా డ్యాన్స్, పాటలతో కూడిన చిత్రాలు చేయను. అలాంటివి నా మనస్తత్వానికి దగ్గరగా ఉండవు. అటువంటి సినిమాలపై అంత నమ్మకం ఏం ఉండదు. ఆ చిత్రాలు చేయలేదని పశ్చాత్తాప పడాల్సిన అవసరం లేదు. నేను బాలీవుడ్‌కు కొత్త వ్యక్తినని ఎప్పుడూ అనుకోనని జాతీయ మీడియాతో చేసిన చిట్ చాట్ లో వెల్లడించింది. లవ్ సోనియా చిత్రంలో తన సోదరిని కాపాడే క్రమంలో వ్యభిచార కూపంలోకి చిక్కుకుపోయిన భారతీయ అమ్మాయి మృణాల్ పాత్రలో ఫ్రీదా ఫింటో నటించింది.