అలా అనీషాను ప్రేమించా

అలా అనీషాను ప్రేమించా

 తమిళ కథానాయకుడు విశాల్‌ నటి అనీషాను వివాహం చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని విశాల్‌, అనీషా సోషల్‌మీడియా వేదికగా ఇటీవల ప్రకటించారు. ఇద్దరూ ప్రేమలో ఉన్నట్లు పేర్కొన్నారు. అనీశా ఎలా పరిచయం అయ్యారనే విషయాన్ని విశాల్‌ తాజాగా మీడియాతో పంచుకున్నారు. ''అయోగ్య' సినిమా షూటింగ్‌ కోసం వైజాగ్‌ వచ్చినప్పుడు అనీషా పరిచయం అయింది. అనీశా స్నేహితులతోపాటు నన్ను కలవడానికి వచ్చింది. అప్పుడే 'మైఖెల్‌' అనే సినిమాలో అనీషా కథానాయికగా నటిస్తుందని కూడా చెప్పింది. ఇది వ్యవసాయం నేపథ్యంలో సాగే సినిమా అని, యూనిట్‌కు చెందిన వారు వ్యవసాయదారులని చెప్పడంతో చిత్రాన్ని విడుదల చేస్తానని అప్పుడు అన్నా. అలా కొన్నిసార్లు అనీషాను కలుసుకున్న తరుణంలో ఆమెపై ప్రేమ పుట్టింది. కొన్ని రోజులు గడిచాక నా ప్రేమను ఆమె వద్ద వ్యక్తం చేశాను. దానికి అనీషా కొంత సమయం తీసుకుంది. తర్వాత నా ప్రేమను అంగీకరించింది. అనీషా కేవలం నటిగానే కాకుండా బాస్కెట్‌బాల్‌ క్రీడాకారిణిగా, సామాజిక కార్యకర్తగా గుర్తింపు పొందింది' అని విశాల్‌ చెప్పారు.