ఆరు అడుగుల అందగాడైతేనే

ఆరు అడుగుల అందగాడైతేనే

  రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కి ఎటువంటి అబ్బాయి కావాలి? అతను ఎలా ఉండాలి అన్నదానిపై ఈ కథానాయిక బహిర్గతం చేసింది. తనకు కాబోయే భర్త ఎలా ఉండాలన్నదానిపై అభిమానుల ముందుంచింది. ఆమె మొదట చెప్పిన మాట ఒకటే... అతను మాత్రం పొట్టిగా ఉండకూడదని షరతు విధించింది. రకుల్‌ పొడవు 5.9. అడుగులు. అందుకే తనకంటే కాస్తా పొడవుగా అంటే ఆరు అడుగుల అందగాడైతేనే చేసుకుంటుందట. ఈ విషయాన్ని ఇటీవల మాక్సిమ్‌ మాగ్జయిన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పింది. ప్రస్తుతం రకుల్‌ చేతిలో తెలుగు సినిమా ఒక్కటీ లేదు. కొత్త ప్రాజెక్టు కోసం అన్వేషిస్తుంది. బాలీవుడ్‌లో ఆమె కథానాయిక చేసిన 'అయ్యారీ' చిత్రం ఈనెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది.