‘అద్భుతంగా ఉండాలన్నారు’

‘అద్భుతంగా ఉండాలన్నారు’

  భారత సైనిక స్థావరం ఉరిపై పాకిస్థాన్‌ సైనికులు ఆకస్మికంగా దాడులు చేశారు. దానికి ప్రతిదాడిగా మన సైనికులు సర్జికల్‌ దాడులు నిర్వహించారు. 2016లో జరిగిన ఈ ఘటనలపై తెరకెక్కిన చిత్రం 'ఉరి'. విక్కీ కౌసల్‌, మోహిత్‌ రైనా, పారేశ్‌ రావల్‌, యామి గౌతమ్‌ తదితరులు నటించారు. ఇందులో యామి గౌతమి ఇంటిలిజెన్స్‌ ఆఫీసర్‌గా చేసింది. ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా గౌతమ్‌ మీడియాతో మాట్లాడింది.'' మేము ఈ చిత్రం కోసం వర్క్‌షాపులు చేస్తున్నప్పుడు ఈ దర్శకుడు ఆదిత్యాను అడిగాను 'ఇంత కంటే ఏం చేయాలి? దీని కోసం ఏం చూడాలి? అని అడిగా. దానికి ఆయన సమాధానమిస్తూ..'నువ్వు ఏదైనా చూడు. కానీ నీ పాత్ర మాత్రం అద్భుతంగా రావాలి. 

అలా రావడానికి ఏం చేయాలో నువ్వే ఆలోచించు. ఈ పాత్ర గురించి నువ్వే అన్నీ అయి చేయాలి. అలా ప్రిపేర్‌ అవండి' అని చెప్పారు. ఈ పాత్ర గురించి నన్ను సంప్రదించినప్పుడు చాలా ఆనందమేసింది. దీని కోసం తీవ్రంగా అయితే ప్రయత్నింలేదు. కానీ అంతా సహజంగా చేశాను. నిజంగా ఇది సాధ్యమేనా అన్నట్టు చేశాను. అదే సమయంలో ఇంటిలిజెన్స్‌ ఆఫీసర్‌ పాత్ర ఎలా ఉంటుంది. వారు చేసే పని విధానం గురించి చాలా అన్వేషించి అలా నేనూ ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నా. సినిమాలో పాత్ర అంటే పాత్ర అనే వరకూ ఉంటుంది. కానీ విక్కీ కౌసల్‌ మాత్రం నాకు నిత్యం సలహాలు ఇస్తూ ఉండేవారు. హావభావాలు వ్యక్తం చేయడంలో తప్పిదాలు జరిగితే వెంటనే సరిచేసేవారు. ఇది తప్పు అని చెప్పే వారు కాదు కానీ ఇంకా మెరుగ్గా రావడానికి ప్రయత్నించమని పట్టుబట్టేవారు. ఆయన అనుకున్నట్టు వస్తే 'నేను అనుకున్నది ఇదే' అనేవారు'' అని అన్నారు యామి గౌతమ్‌.