ఐశ్వర్యరాయ్ కు అరుదైన గౌరవం

ఐశ్వర్యరాయ్ కు అరుదైన గౌరవం

  కళారంగంలో సేవలందించిన నటీమణులకు హాలీవుడ్‌లో నూతనంగా అలనాటి నటి మెరిల్‌ స్ట్రీప్‌ పేరిట విఫ్ట్‌(ఉమెన్‌ ఇన్‌ ఫిల్మ్స్‌ అండ్‌ టెలివిజన్‌) పేరిట అవార్డును ప్రవేశపెట్టారు. ఈ అరుదైన పురస్కారాన్ని మొదటిసారిగా బాలీవుడ్‌ హీరోయిన్‌ ఐశ్వర్యరాయ్కు అందజేసి గౌరవించారు. వాషింగ్టన్‌లో శనివారం నిర్వహించిన విఫ్ట్‌ అవార్డ్స్‌లో భాగంగా ఐశ్వర్యరాయ్కు మెరిల్‌ స్ట్రీప్‌ అవార్డు వరించింది. ఈ అవార్డు అందుకున్న ఏకైక సెలబ్రిటీ ఐశ్వర్యరాయ్ కావడం విశేషం. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఐశ్యర్యరారు తన తల్లి బృందా గారు, కుమార్తె ఆరాధ్యతో కలిసి వెళ్లారు. ఈ వేడుకలో అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్‌ ఎమరాల్డ్‌ అవార్డు అందుకున్నారు. త్వరలో ఐశ్వర్య తన భర్త అభిషేక్‌తో కలిసి 'గులాబ్‌ జామున్‌' అనే సినిమాలో నటించబోతున్నారు. సినిమా చిత్రీకరణ త్వరలో ప్రారంభం కానుంది.