అక్కడా సన్నీ లియోనే టాప్

అక్కడా సన్నీ లియోనే టాప్

 ఇండియన్స్‌కు ఆన్‌లైన్ పోర్న్‌పై మక్కువ చాలా ఎక్కువ. ఈ విషయం మరోసారి స్పష్టమైంది. 2018లో గూగుల్‌లో ఎక్కువగా వెతికిన సెలబ్రిటీల జాబితాలో మాజీ పోర్న్ స్టార్, బాలీవుడ్ నటి సన్నీ లియోన్ ఫస్ట్ ప్లేస్‌లో ఉండటం విశేషం. ఆమె తర్వాతి స్థానాల్లో సల్మాన్ ఖాన్, ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నారు. ఇక బాలీవుడ్ హీరోయిన్లు కత్రినా కైఫ్, దీపికా పదుకోన్‌ల గురించి కూడా బాగానే వెతికారు. అయితే వాళ్ల సినిమాల గురించి కాదు. హాట్, సెక్సీలాంటి పదాలు వాడి ఆ హీరోయిన్ల ఫొటోలు, వీడియోల కోసం వెతికినట్లు లైవ్‌మింట్.కామ్ వెబ్‌సైట్ విశ్లేషణ వెల్లడించింది. 

సినిమాలు, రాజకీయాల కంటే పోర్న్ వైపే ఇండియన్స్ ఎక్కువగా దృష్టి సారిస్తున్నారని ఈ సర్వే తేల్చింది. ఇక ఈ ఏడాది ఆసక్తికరంగా బాలీవుడ్ సినిమాల కంటే భోజ్‌పురి సినిమాల గురించే ఎక్కువగా వెతికినట్లు కూడా తేలింది. పోర్న్ తర్వాత సినిమా, ఇతర వినోదానికి సంబంధించిన వార్తలను ఎక్కువగా వెతుకుతున్నారు. క్రికెట్, సాధారణ వార్తలు పూర్తిగా వెనుకబడిపోయాయి. 2018లో ఓవర్‌నైట్ సెన్సేషన్‌గా మారిన మళయాల నటి ప్రియా ప్రకాశ్ వారియర్ గురించి కూడా గూగుల్ సెర్చ్‌లు చాలా ఎక్కువగా ఉన్నట్లు సర్వేలో తేలింది.