అమ్మ నాన్న పెళ్లిచేస్తామన్నారు!

అమ్మ నాన్న పెళ్లిచేస్తామన్నారు!

 ధడక్ చిత్రం ద్వారా బాలీవుడ్‌లో అరంగేట్రం చేసి చక్కటి అభినయంతో అందరిని మెప్పించింది జాన్వీ కపూర్. సినీరంగ ప్రవేశానికి ముందే ఈ సొగసరి ప్రేమాయణం గురించి వార్తలు వినిపించాయి. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్‌కుమార్ మనవడు శిఖర్ పహారియా అనే యువకుడితో జాన్వీకపూర్‌లో ప్రేమలో ఉందని ముంబయి మీడియాలో వార్తలొచ్చాయి. తాజాగా తన ప్రేమ వ్యవహారం గురించి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాల్ని వెల్లడించింది జాన్వీకపూర్. ప్రేమ విషయం తెలుసుకున్న జాన్వీ తల్లిదండ్రులు శ్రీదేవి, బోనీకపూర్ ఆమెపై సీరియస్ అయ్యారట. మీడియాలో వచ్చిన వార్తల్ని చూసి అమ్మనాన్న చాలా సీరియస్ అయ్యారు.

ఆ అబ్బాయి ఎవరో చెప్పు...మేమే పెళ్లి చేస్తాం అని చెప్పారు. అయితే నేను ఎవరినీ ప్రేమించడం లేదని వారితో చెప్పాను. ఇష్టం వేరు, ప్రేమించడం వేరని..రెండు భావాల మధ్య తేడా ఉంటుందని వివరించే ప్రయత్నం చేశాను. అయితే నా మాటల్లోని లాజిక్ వారికి అర్థం కాలేదు అని చెప్పుకొచ్చింది జాన్వీకపూర్. ముంబయి సినీ వర్గాలు మాత్రం ఈ జంట ప్రేమాయణం నిజమే అని చెబుతున్నాయి. వీరిద్దరు కలిసి తీసుకున్న వ్యక్తిగత ఫొటోలు కొన్ని సోషల్‌మీడియాలో వైరల్ అయ్యాయి కూడా. జాన్వీకపూర్ త్వరలో తఖ్త్ అనే చిత్రంలో నటించబోతున్నది.