అమ్మాయిల గురించి అనుష్క సందేశం ఏంటి?

అమ్మాయిల గురించి అనుష్క సందేశం ఏంటి?

 సౌత్ స్టార్ హీరోయిన్ అనుష్క ఈ రోజు అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా తన ఫేస్ బుక్ ద్వారా ఓ మంచి సందేశాన్ని ఇచ్చింది. సొసైటీలో మహిళల హోదాని మెరుగుపరచడానికి మనం అందరం కలిసి పని చేద్దాం. ఈ భూమిపై ఉన్న ప్రతి అమ్మాయి సురక్షితమైన అనుభూతికి, క్వాలిటీ ఎడ్యుకేషన్ మరియు సమాన హక్కులను కలిగి ఉండటానికి అర్హురాలు. అంతర్జాతీయ బాలికల దినోత్సవ శుభాకాంక్షలు అంటూ చిన్నారితో సరదాగా దిగిన ఫోటోని పోస్ట్ చేస్తూ ఈ కామెంట్ పెట్టింది. ప్రస్తుతం భాగమతి ప్రాజెక్ట్ తో బిజీగా ఉన్న అనుష్క, ఈ చిత్రంతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అశోక్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్ర ఫస్ట్ లుక్ నవంబర్ 7న అనుష్క పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేయనున్నారు.