‘అందంగా ఉన్నా లోపాలు ఎంచుతున్నారు’

‘అందంగా ఉన్నా లోపాలు ఎంచుతున్నారు’

 గతంలో తానేం చేసినా అందరూ మెచ్చుకునేలా ఉండాలని భావించేదాన్ని అని, ఇప్పుడు ఆ ఆలోచనకు స్వస్తి చెప్పానని ఇలియానా చెప్పింది. అందరినీ మెప్పించడం సాధ్యం కాదేమోనని పేర్కొంది. ఎంత అందంగా ఉన్నా ఏదొక లోపం ఉన్నట్టు చెబుతున్నారని చెప్పింది. ఇలియానా ఆండ్రూతో వివాహం అయిన తర్వాత విహార యాత్రకు వెళ్లారు. అక్కడ ఫొటోలను ఆమె నిత్యం ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేస్తోంది. ఈ సందర్భంగా కొన్ని వ్యాఖ్యలు చేసింది. డిప్రిషన్‌, బాడీ ఇమేజెస్‌ సమస్యలపై స్పందించింది. నటిగా తనకు చాలా బాధ్యతలు ఉంటాయని, తాను కొత్తగా కనిపించాలని అభిమానులు కోరుకుంటారని అన్నది. ఒత్తిడి వల్ల అన్ని వేళలా అందంగా కనిపించడం సాధ్యం కాదేమోనని అంది. తనలా శారీక సమస్యలను ఎదుర్కొన్నా వారి గురించి పట్టించుకోవడం లేదని, ఒక్కో రోజు అందంగా ఉన్నా లోపాలు చూపుతున్నారని వాపోయింది.