‘అందరూ ఆనందించేలా ఉంటాయి’

‘అందరూ ఆనందించేలా ఉంటాయి’

 తన చిత్రాలు అన్ని తరగతుల ప్రేక్షకులు ఆనందించేలా ఉంటాయని బాలీవుడ్‌ నటి అలియా భట్‌ చెప్పింది. గత ఏడాది ఈమె 'రాజీ'లో అద్భుతమైన నటనను ప్రదర్శించింది. ఆమె రణవీర్‌తో నటిస్తున్న 'గల్లీ బారు' విడుదల కానుంది. దీంతో రణబీర్‌ హీరోగా చేస్తున్న 'బ్రహ్మాస్త్ర'లోనూ నటిస్తుంది. ఇది కూడా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఈ నటి ఇటీవల నిక్‌లోడీయెన్‌ కిడ్స్‌ ఛాయిస్‌ అవార్డులో భాగంగా ఫేవరెట్‌ మూవీ యాక్టర్‌ అవార్డు సొంతం చేసుకుంది. 

ఈ సందర్భంగా మాట్లాడుతూ ''నేను చిన్న పిల్లల సినిమాలను ప్రేమిస్తా. అటువంటి సినిమా చేసే అవకాశం వస్తే తప్పకుండా చేస్తా. నన్ను పిల్లలు కనెక్ట్‌ అవుతారని అనుకుంటూ ఉంటా. అయితే పిల్లల సినిమాలు కాకుండా వేరే ప్రాజెక్టులు ఇప్పుడు చేస్తున్నా. అన్ని గ్రూపులు వారు నా చిత్రాలను ఆనందిస్తారని అనుకుంటున్నా'' అని చెప్పింది అలియా. పిల్లలు 'బ్రహ్మాస్త్ర'ను పిల్లలు ఎలా ఇష్టపడతారన్న ప్రశ్నకు ఆమె బదులిస్తూ... ' ఈ సినిమా అన్ని వయసుల వారూ చూడదగిన చిత్రం. చిన్నారులకైతే మరింత ఆసక్తిగా ఉంటుంది. ఈ సినిమా ఫలితంపై చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నా. ఈ సినిమా కోసం మేమంతా చాలా కష్టపడ్డాం''అని తెలిపింది.